- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినీ- సీరియల్ నటుడు అజిత్ విజయన్ (Ajith Vijayan) 57 సంవత్సరాల వయసులో తన నివాసంలో కన్నుమూశారు. ఆయన దివంగత సికె విజయన్, మోహినియాట్టం గురువు కళా విజయన్‌ల కుమారుడు. అయితే అజిత్ విజయన్ ‘ఒరు ఇండియన్’, ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘బెంగళూరు డేస్’, అంజు సుందరికల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా బుల్లి తెరపై ఎన్నో సీరియల్స్‌లో యాక్ట్ చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఆయన మరణం పై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇటు తెలుగు చిత్రాలలో కూడా నటించడంతో తెలుగు ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, ఆడియన్స్ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఆయనకు భార్య ధన్య, కుమార్తెలు గాయత్రి, గౌరి ఉన్నారు. ఇక అజిత్ విజయన్ కన్నుమూయడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






