- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు వీరేందర్ గుహ్‌మన్ హఠాన్మరణం
ప్రముఖ పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వీరేందర్ సింగ్ ఘుమన్ (47) గురువారం కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వీరేందర్ సింగ్ ఘుమన్ (47) గురువారం కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. అయితే, ఈ వార్త ఫిట్‌నెస్, సినిమా రంగాల ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ఆయన సాయంత్రం 5 గంటల సమయంలో అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన సోదరుడి కుమారుడు అమన్‌జోత్ సింగ్ ఘుమన్ జలంధర్‌లో మీడియాకు తెలిపారు. వరిందర్ ఘుమన్‌కు భుజం నొప్పి ఉండటంతో చికిత్స తీసుకునేందుకు అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందిస్తుండగా.. కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం)తో ఆయన గుహ్‌మన్ మృతిచెందినట్లుగా మేనేజర్ యద్వీందర్ సింగ్ తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన వీరేందర్ గుహ్‌మన్ జలంధర్‌లో ఎక్కువ కాలం నివసించారు.1983లో జన్మించిన ఆయన, 42 సంవత్సరాల వయస్సులో ప్రాణాలు కోల్పోయారు. 2009లో ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ సాధించారు. అనంతరం ‘మిస్టర్ ఏషియా’లో రన్నరప్ అయ్యారు. ప్రపంచంలో మొదటి వెజిటేరియన్ ప్రొఫెషనల్ బాడీబిల్డర్‌గా చరిత్ర సృష్టించారు. IFBB (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీబిల్డింగ్) ప్రో కార్డ్ పొందిన మొదటి భారతీయుడు గుహ్‌మన్. హాలీవుడ్ లెజెండ్ ఆర్నల్డ్ ష్వార్జెనెగ్గర్ ఆయనను ఆసియాలో తన హెల్త్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. 2012లో పంజాబీ మూవీ ‘కబడ్డీ వన్స్ మోర్’తో సీనిరంగ ప్రవేశం చేశారు. బాలీవుడ్‌లో ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్’ (2014), ‘మర్జావాన్’ (2019) చిత్రాల్లో నటించారు. 2023లో సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘టైగర్ 3’లో కీలక పాత్ర పోషించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్‌తో ఫిట్‌నెస్ టిప్స్ పంచుకుంటూ యూత్‌కు వీరేందర్ గుహ్‌మన్ ప్రేరణగా నిలిచారు.






