సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

by Gugulothu.Kavitha |

ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee) శుక్రవారం కన్నుమూశారు. 83 ఏళ్ల వయసున్న దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee) శుక్రవారం కన్నుమూశారు. 83 ఏళ్ల వయసున్న దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో నటించి మెప్పించారు.

అలా ఏక్ బార్ మూస్కురా దో, జో జీతా వోహి సికందర్, లాల్ పత్తర్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగుతాయి. ఇక ఆయన మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా అయాన్ ముఖర్జీ ప్రస్తుతం హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(NTR) లతో ‘వార్ 2’(War-2) మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.


Next Story