- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రదీప్‌కు సపోర్ట్ చేసేందుకు వచ్చిన గ్లోబల్ స్టార్.. నటుడి కాళ్ళు మొక్కడంతో అంతా షాక్! (ట్వీట్)
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ఎన్నో షోస్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ఎన్నో షోస్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా నటనపై ఆసక్తితో టాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేశాడు. ఇక ఇటీవల ప్రదీప్ హీరోగా మారి ఓ మూవీ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రెండో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే దీనిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi)పేరుతో తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో జబర్దస్త్ బ్యూటీ దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను భరత్ ద్వయం తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
ఇందులో సత్య, గెటప్ శ్రీను, మురళీధర్, జాన్ విజయ్(John Vijay), రోహిణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రదీప్‌కు సపోర్ట్ చేయడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన ప్రదీప్ ఇండికి వచ్చి టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే సత్య రామ్ చరణ్ కాళ్లు మొక్కడంతో ఆయన కూడా ఆయన కాళ్లు మొక్కినట్లు చేశారు. అయితే అదంతా ఫన్నీగా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విడియోను ప్రదీప్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు అంత పెద్ద స్టార్ అయి ఉండి అలా చేయడమేంటని షాక్ అవుతున్నారు.






