గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. ‘లలిత’ సినిమా నుంచి హీరోయిన్ లుక్ విడుదల

by Mallepaka Hamsa |

ఈ కథలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‌లో జోడించిన ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. ‘లలిత’ సినిమా నుంచి హీరోయిన్ లుక్ విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథాంశంతో ఒక సరికొత్త సినిమా ‘లలిత’ అనే ఆసక్తికర టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్‌లో ప్రముఖ కవి, రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, పాటలు అందించడమే కాకుండా ఆయనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం. జొన్నవిత్తుల దర్శకత్వంలో వస్తున్న.. ఈ చిత్రాన్ని రాధిక సమర్పణలో, కాస్మిక పవర్ క్రియేట్స్ బ్యానర్‌పై నిర్మాతలు సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది. ‘లలిత’ చిత్రంలో హీరోయిన్‌గా నటి నందు నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కథలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‌లో జోడించిన ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు’ అనే ట్యాగ్‌లైన్‌ను ఈ సినిమాకు పెట్టారు. నేటితరం ప్రేమకథల్లో, రిలేషన్‌షిప్‌లలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య జరిగే కొన్ని సున్నితమైన అంశాలను, అలాగే సమాజంలో మారాల్సిన కొన్ని ఆలోచనలను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ క్యాప్షన్ చూస్తే అర్థమవుతోంది.

Next Story