- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేబీ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్‌తో గొడవ?.. క్లారిటీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ సినిమా(Baby Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ సినిమా(Baby Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవర్గం అభిమానులను తెగ ఆకట్టుకున్నది. మొత్తంగా దాదాపు రూ.50 కోట్లకు పైగానే కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), హీరోయిన్ వైష్ణవీ చైతన్య(Vaishnavi Chaitanya) మధ్య గొడవలు జరిగాయన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై హీరో ఆనంద్ దేవరకొండను వివరణ ఇవ్వాలని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి స్పందించిన ఆనంద్.. అలాంటిదేమీ లేదు. గొడవ కాదు కదా.. చిన్న ఇష్యూ కూడా లేకుండా సినిమాను ప్రశాంతంగా పూర్తి చేశాం. గొడవ జరిగింది అనేది కూడా మొదటిసారి వింటున్నాను. దీనిని మీరే సృష్టిస్తున్నారా అని మీడియా ప్రతినిధిని ఆనంద్ దేవరకొండ రివర్స్ ప్రశ్నించడంతో అంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బేబీ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ మేల్ సింగర్ వంటి ముఖ్యమైన విభాగాల్లో ‘బేబీ’ సినిమా జాతీయ అవార్డులు దక్కించుకున్నది. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా డైరెక్టర్ సాయిరాజేశ్‌కు జాతీయ పురస్కారం దక్కింది.






