సినీ ప్రియులకు పండుగే.. ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయంటే?

by Mallepaka Hamsa |

ప్రతి నెలలో దాదాపు నాలుగైదు సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో సినీ ప్రియులకు పండుగే అని చెప్పవచ్చు.

సినీ ప్రియులకు పండుగే.. ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయంటే?
X

దిశ, సినిమా: ప్రతి నెలలో దాదాపు నాలుగైదు సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో సినీ ప్రియులకు పండుగే అని చెప్పవచ్చు. ఈ ఒక్క నెలలోనే ఏకంగా ఏడు తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కాంబోలో రాబోతున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి రాబోతుంది. అలాగే విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటిస్తున్న ‘లైలా’ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్‌కు రెడీగా ఉంది.

అయితే ఇందులో ఆయన ఎప్పుడూ లేని విధంగా లేడీ గెటప్‌లో నటిస్తున్నారు. ఇక అదే రోజున కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘దిల్‌రూబా’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సందీప్ కిషన్(Sandeep Kishan), రితూ వర్మ కలిసి నటిస్తున్న ‘మజాకా’ సినిమా ఫిబ్రవరి 21న తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక మరోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) నటిస్తున్న మల్టీస్టారర్ ‘భైరవం’ కూడా ఇదే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్ కలిసి నటిస్తున్న ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి రానుంది. ‘ఒక పథకం ప్రకారం’ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

Next Story