- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sandra Thomas : మలయాళ ఇండస్ట్రీలో మరో బాంబ్ పేల్చిన మహిళా నిర్మాత.. డ్రగ్స్ వాడటం కామన్ అంటూ వ్యాఖ్య
పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కామన్ అంటూ మలయాళ ఇండస్ట్రీ(Malayala Film Industry)లో ఓ మహిళా నిర్మాత మరో బాంబ్ పేల్చింది.

దిశ, వెబ్ డెస్క్ : పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కామన్ అంటూ మలయాళ ఇండస్ట్రీ(Malayala Film Industry)లో ఓ మహిళా నిర్మాత మరో బాంబ్ పేల్చింది. ఇప్పటికే సంచలనాల్లో నిలుస్తున్న మలయాళీ ఇండస్ట్రీలో.. నిర్మాత, నటి సాండ్రా థామస్(Sandra Thomas) చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. ఇటీవల ఈ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్(Drugs) వాడకం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. సినిమా షూటింగ్ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైందని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసని, కానీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని, ఫిల్మ్ అసోసియేషన్లు ఈ సమస్యను 5-10 సంవత్సరాల క్రితమే నియంత్రించి ఉండాల్సిందని సాండ్రా విమర్శించారు.
ఆమె ప్రముఖ నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ను ఉద్దేశించి.. పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ఈ సమస్యను విస్మరిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. డ్రగ్స్ వాడకం పురుషులు, మహిళలు అంటూ తేడా ఏమీ లేదని.. ఫిర్యాదు చేస్తే షూటింగ్ ఆలస్యం అవుతుందని, నటుల ఇమేజ్ దెబ్బతింటుందని భయపడి ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారని ఆమె తెలిపారు. సాండ్రా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతుండగా.. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మలయాళ ఇండస్ట్రీ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. సాండ్రా థామస్, ‘అమెన్’, ‘జాకరియాయుడే గర్భినికల్’, ‘ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్’ వంటి చిత్రాలతో నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. సాండ్రా థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను నడుపుతున్నారు.






