మూవీ లవర్స్‌కు డబుల్ ట్రీట్.. ఒకే రోజు ఓటీటీలో రెండు క్రేజీ సినిమాలు

by Pulgam srinivas |

‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలు మే 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

మూవీ లవర్స్‌కు డబుల్ ట్రీట్.. ఒకే రోజు ఓటీటీలో రెండు క్రేజీ సినిమాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీలోకి కొన్ని సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే ఈ వారం ఒకే ఓటీటీలో రెండు క్రేజీ తెలుగు సినిమాలు రాబోతుండటం విశేషం. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఆ సినిమాలు ఏవి? ఏ తేదీ నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాం.

బైకర్

శర్వానంద్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బైకర్’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా మే 1వ తేదీ నుండి ఈ సినిమాను తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

రాకాస

సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా, మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాకాస’ సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని మే 1వ తేదీ నుండి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఈ రెండు సినిమాలు మే 1వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

Next Story