- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రేజీ కాంబో.. ‘బాలన్ ది బాయ్’ సినిమా కోసం అక్కినేని నాగార్జునతో చేతులు కలిపిన మేకర్స్
ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ, కింగ్ అక్కినేని నాగార్జునకు చెందిన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే మలయాళ సినిమాతో ఇండియా వైడ్‌గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త సినిమా ‘బాలన్ ది బాయ్’. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెస్పియన్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక చక్కటి నేటివిటీ కథతో, అలాగే ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ మూవీని వచ్చే నెల జూన్ 19, 2026 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ, కింగ్ అక్కినేని నాగార్జునకు చెందిన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టింది. "మా ‘బాలన్ ది బాయ్’ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయడం కోసం టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ హౌస్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో చేతులు కలపడం మాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తోంది. ఈ చిత్రం జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది" అని మేకర్స్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.






