- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజా సాబ్’ నుంచి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేసిందోచ్.. మ్యూజికల్ సర్‌ప్రైజ్ అంటూ స్పెషల్ వీడియో రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.
దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ వీడియోను మూవీ టీమ్ షేర్ చేసింది. చిన్న మ్యూజికల్ సర్‌ప్రైజ్ ఇస్తూ.. ‘రాజే యువరాజే’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. అయితే ప్రోమోలో హీరోయిన్ నిధి అగర్వాల్.. ‘నీది ప్రేమ.. ప్రేయర్ చేస్తా కళ్లు మూసుకో’ అని చెప్పే డైలాగ్ ఆడియన్స్‌ను మరింత అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






