Video Viral: లైవ్ షోలో లిప్ కిస్.. షాకైన హీరోయిన్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-19 16:07:47  IST  )

లైవ్ షోలో హీరోయిన్‌కు పిల్లాడు లిప్ కిస్ పెట్టేందుకు ప్రయత్నం చేశారు...

Video Viral: లైవ్ షోలో  లిప్ కిస్.. షాకైన హీరోయిన్..!
X

దిశ, వెబ్ డెస్క్: లైవ్ షోలో హీరోయిన్‌కు పిల్లాడు(Child) లిప్ కిస్ పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో హీరోయిన్(Heroine) షాకైయ్యారు. ఈ ఘటన తమిళ సరిగమప షో(Tamil Sarigamapa Show)లో జరిగింది. ఈ షోలో హీరోయిన్ కాయాదు లోహర్(Kayadu Lohar) విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. షో జరుగుతుండగా ఓ పిల్లాడు ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమెను హత్తుకునే క్రమంలో లిప్ కిస్ పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తల తిప్పుకుంటున్నా ముందుకుసాగాడు. దీంతో షో మొత్తం అరుపులు, కేకలతో దద్దరిల్లింది.

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పిల్లాడి ప్రవర్తనను తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలోనే కంట్రోల్ చేయాలని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు TRP కోసం అశ్లీలతను ప్రోత్సహించకుండా షో నిర్వాహకులు కఠినంగా వ్యవహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story