- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది, ఇది నిజంగా నా అదృష్టం.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘శ్రీ’(sri) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘హ్యాపీ డేస్’(Happy Days) చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘శ్రీ’(sri) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘హ్యాపీ డేస్’(Happy Days) చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కాళిదాసు’(Kalidasu), ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’(Koncham Istam Koncham Kastam), ‘100 పర్సెంట్ లవ్’(100% Love), ‘బద్రీనాథ్’(Badrinath), ‘ఊసరవెల్లి’(Oosaravelli), ‘రచ్చ’(Racha), ‘ఎందుకంటే ప్రేమంట’(Endukante Premanta), ‘రెబల్’(Rebel), ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’(Cameraman Gangatho Rambabu), ‘తడాఖా’(Thadaka), ‘ఆగడు’(Aagadu), ‘బాహుబలి’(Bahubali), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘సైరా నరసింహా రెడ్డి’(Syra Narasimha Reddy) వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా తన అందంతో కుర్రకారుకు మత్తెక్కించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఏమైందో ఏమో కానీ ప్రజెంట్ టాలీవుడ్‌లో అంతగా సినిమాలు చేస్తలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. అలాగే మరోపక్కా వెబ్ సిరీస్‌లలోనూ అలరిస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ యూత్‌కి ఫుల్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘జైలర్’(Jailer) మూవీలో ‘నూ కావాలయ్యా నూ కావాలయ్యా’ అనే సాంగ్‌లో చిందులేసింది. అలాగే ‘స్త్రీ-2’(Sthree-2)లోనూ ‘ఆజ్ కి రాత్’ అంటూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘జీవితంలో ఒక్కసారే ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. కాశీలో ఈ చిత్రం ప్రారంభించిన నాటి నుంచి ఇందులో మ్యాజిక్ ఉందనే భావన కలిగింది. కాశీ, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ చేశాం. సంపత్ విజువలైజేషన్ వల్లే ఈ మూవీ సిద్ధమైంది. సంపత్‌తో నేను చేస్తున్న నాలుగో సినిమా ఇది. ఇది మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో జరిగే సన్నివేశాలను ప్రేక్షకులు ఏమాత్రం ఊహించలేరు. సినిమా సమయంలో మేము ఏదైతే మ్యాజిక్ ఫీలయ్యామో ఆడియన్స్ సైతం అదే ఫీలవుతారని ఆశిస్తున్నా.
సూపర్ నేచురల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఇలాంటి చిత్రాలకు మ్యూజిక్ ఎంతో ప్రధానం. అజనీష్ అద్భుతమైన సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాము’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మిల్క్ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’. ఈ సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇక దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. మధు క్రియేషన్స్, సంపత్ నంది వర్క్స్‌పై డి మధు నిర్మిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 22న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచిన సంగతి తెలిసిందే.






