- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు బంపరాఫర్.. ఇలా చేస్తే మీరు కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనే చాన్స్ కొట్టేయవచ్చు(వీడియో)
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న ఆదరణ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న ఆదరణ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ షో 8 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సారి కూడా అక్కినేని స్టార్ హీరో నాగార్జునే షోను హోస్ట్ చేయనున్నారు. ఇందులో భాగంగా ‘ఈసారి చదరంగం కాదు రణరంగం’ అంటూ నాగ్ చెప్పిన పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తి పెంచింది. అయితే బిగ్ బాస్ షోకు ఎక్కువ బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెర్లనే ఇందులోకి కంటెస్టెంట్లుగా తీసుకుంటారు.
గతంలో కొన్ని సార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 లో మీరు కూడా పాల్గొనచ్చు అని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లు మీరు బిగ్ బాస్‌ని ప్రేమించారు. ఎంతో ఆదరించారు. ఇప్పుడు మేము ఆ ప్రేమాభిమానాలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. సెలబ్రిటీలు మాత్రమే కాదు మీకు కూడా బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనాలంటే https://bb9.jiostar.com ఈ లింక్ లోకి వెళ్లి మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఒక మూడు నిమిషాలు మీ గురించి, మీరు ఎందుకు బిగ్ బాస్‌కి హౌస్ లోకి వెళ్లాలనుకుంటున్నారో తెలియచేస్తూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలి. దీనిని బిగ్ బాస్ టీమ్ పరిశీలించి అన్ని అర్హతలు, అనువైన వాళ్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.






