- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంజలి ఖాతాలో బంపర్ ఆఫర్.. 19 ఏళ్ల తర్వాత ఆ హీరోతో రొమాన్స్!
దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి.

దిశ, సినిమా: హీరోయిన్ అంజలి తన అద్భుతమైన నటనతో, హోమ్లీ లుక్స్‌తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం కూడా క్రేజీ ప్రాజెక్టులతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత ఏడాది విడుదలైన ‘మదగజరాజా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అంజలి, తాజాగా ఒక బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజా .. సమాచారం ప్రకారం.. అంజలి తన కెరీర్ ఆరంభంలో జతకట్టిన ఓ హీరో సరసన మరోసారి రొమాన్స్ చేయబోతోంది. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో జీవా, అంజలి కాంబినేషన్‌లో గత 2007 లో వచ్చిన ‘కత్రదు తమిజ్’ (తెలుగులో ‘కళాశాల రఘురామ్’) సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీలో వీరిద్దరి నటనకు, కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి. ఈ క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాకు వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు వసంత బాలన్ దర్శకత్వం వహించబోతున్నారు. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో ఆయన రూటే సెపరేట్. ఇక ఈ సినిమాను కన్నన్ రవి గ్రూప్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలతో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.






