- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ట్విస్ట్‌లతో రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
ఈ సిరీస్‌కు సంబంధించి రెండో సీజన్‌ను సరికొత్త కథతో, కొత్త పాత్రలతో రూపొందించారు.

దిశ, సినిమా: ఓటీటీ ట్రెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులు కూడా ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులతో ఎన్నో కొత్త చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓటీటీలో థియేటర్ రిలీజ్ సినిమాలతో పాటు సరికొత్త కథలతో వస్తున్న వెబ్ సిరీస్‌లు కూడా డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హిట్ సిరీస్‌లకు తదుపరి సీజన్లను తీసుకువచ్చేందుకు మేకర్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం వచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఒక పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైంది. 2022లో వర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘వదంది’ వెబ్ సిరీస్ ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఒక యంగ్ హీరోయిన్ హత్య నేపథ్యంలో సాగే ఆ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది.
కాగా, ఇప్పుడు ఈ సిరీస్‌కు సంబంధించి రెండో సీజన్‌ను సరికొత్త కథతో, కొత్త పాత్రలతో రూపొందించారు. 'వదంది: ది మిస్టరీ ఆఫ్ మణి' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ రెండో సీజన్‌లో శశికుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌కు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించగా, ప్రసిద్ధ నిర్మాతలు పుష్కర్ - గాయత్రి తమ క్రియేటివ్ బ్యానర్‌పై దీనిని నిర్మించారు. ఈ సీక్వెల్‌ను రాబోయే ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. షాకింగ్ ట్విస్టులు, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కు ఈ సీక్వెల్ మరో అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఇక మొదటి సీజన్ సాధించిన సక్సెస్ వల్ల ఈ రెండో భాగంపై ఓటీటీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






