- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Fauji' : ప్రభాస్ 'ఫౌజీ' లో రజాకార్స్ ఏపిసోడ్..రంగంలోకి హలీవుడ్ యాక్టర్
దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) - హీరో ప్రభాస్(Prabhas) కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఫౌజీ'('Fauji') సినిమా(Movie)నిర్మాణ దశలోనే అభిమానుల్లో అంతకంతకు క్రేజ్ పెంచుతోంది

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) - హీరో ప్రభాస్(Prabhas) కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఫౌజీ'('Fauji') సినిమా(Movie)నిర్మాణ దశలోనే అభిమానుల్లో అంతకంతకు క్రేజ్ పెంచుతోంది. పీరియాడిక్ యాక్షన్-డ్రామాగా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. 1940 వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా, బ్రిటీష్ సైన్యంలో సోల్జర్ గా కనిపించనున్నాడు. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది.
యుద్ధ సన్నివేశాలకు లవ్ స్టోరీని జతకురూస్తు తీస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలకు సిద్దమవుతోందా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సినిమా స్టోరీలో కొంత కనెక్షన్ ఉంటుందని సమాచారం .మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమా ఆప్డేట్స్ పై ఆసక్తి చూపుతున్న ప్రభాస్ అభిమానులకు తాజా ఆప్డేట్ మరింత ఉత్సాహాన్ని అందించనుంది. ఈ సినిమాలో రజాకార్ల నేపథ్యంలో సాగే భారీ ఎపిసోడ్ ఉండనుందన్న సమాచారం క్రేజీగా మారింది.
ఈ సినిమాలో రజాకార్ ఎపిసోడ్ ప్రధాన ఘట్టమన్న వార్త ఆసక్తి రేపుతోంది.హైదరాబాద్ సంస్థానం నిజాం ప్రభువు నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు నాడు రజాకార్లతో సాగించిన పోరాటం చిరస్మరణీయం. తెలంగాణ ప్రజలు రజాకార్లపైన, నిజాం సైన్యంపైన సాగించిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అటువంటి చారిత్రాక ఘట్టమైన రజాకార్ ఎపిసోడ్ తో ఫౌజీ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఈ ఎపిసోడ్ లో ఎమోషన్స్, యాక్షన్స్ కు పెద్ద పీట వేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన సన్నివేశాల్ని మార్చిలో తెరకెక్కించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
అయితే ఈ ఎపిసోడ్‌లో కనిపించే ఓ కీలక పాత్ర కోసం ఓ హాలీవుడ్ యాక్టర్ ను రంగంలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. 'ఫౌజీ' సినిమాలో ఈ కీలక ఎపిసోడ్ లో నటించేందుకు ఆ హాలీవుడ్ నటుడు దాదాపు ఆరు నెలలుగా ఈ పాత్ర కోసం మేకోవర్ అవుతున్నాడని తెలుస్తోంది. ఆ నటుడెవరన్నది త్వరలోనే చిత్రబృందం ప్రకటించబోతోంది. సినిమాలో ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్ పార్ట్‌ను మునుపెన్నడూ చూడని కొత్త యాంగిల్‌లో చూపించనున్నారట. ఇదే భాగంలో కనిపించబోయే మరో నాయిక పాత్ర కోసం చిత్రబృందం చాలా రోజులుగా అన్వేషిస్తోంది.
ఈ పాత్రకు కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. పాపులర్ మలయాళ భామ నమితా ప్రమోద్ ఈ మూవీలో సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనైతే రాలేదు. నమితా ప్రమోద్ ఇప్పటికే తెలుగులో చుట్టాలబ్బాయి, కథలో రాజకుమారి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో కీలకమైన బ్రిటిష్ యువరాణి పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారు.






