రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అక్కడ టచ్ చేయడంతో ఏం చేసిందంటే?

by Mallepaka Hamsa |

ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ.. రష్మిక ఇచ్చిన ఎక్స్‌ప్రేషన్స్ చూస్తే మాత్రం.. ఏదో జరిగినట్లుగా అర్థమవుతోంది.

రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అక్కడ టచ్ చేయడంతో ఏం చేసిందంటే?
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కృతి సనన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కాక్‌టైల్-2’ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్ మొదలెట్టిన చిత్రబృందం ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఈవెంట్‌లో పాల్గొన్న రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. స్టేజ్‌పై రష్మిక మాట్లాడుతుండగా.. షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక వెంటనే తీవ్ర అసౌకర్యానికి గురై అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ.. రష్మిక ఇచ్చిన ఎక్స్‌ప్రేషన్స్ చూస్తే మాత్రం.. ఏదో జరిగినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది వారంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రష్మిక సినిమాల విషయాని కొస్తే.. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ‘రణబాలి’ చేస్తోంది. పెళ్లైన తర్వాత భార్యభర్తలిద్దరు కలిసి ఒకే స్క్రీన్‌ పంచుకోవడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా రాబోతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story