ఓ బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్ రాబోతుంది.. అది చూసి అందరూ షాక్‌ అవుతారు: సుప్రీత్‌

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-04 15:12:54  IST  )

హర్ష రోషన్(Harsha Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన(Saanvi Meghna), నిహాల్ కోధాటి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టుక్‌ టుక్‌’.

ఓ బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్ రాబోతుంది.. అది చూసి అందరూ షాక్‌ అవుతారు: సుప్రీత్‌
X

దిశ, సినిమా: హర్ష రోషన్(Harsha Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన(Saanvi Meghna), నిహాల్ కోధాటి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టుక్‌ టుక్‌’. సి.సుప్రీత్‌ కృష్ణ(Supreet Krishna) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను చిత్రవాహిని, ఆర్ వై జి సినిమాస్‌ బ్యానర్‌పై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘టుక్ టుక్’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో భాగంగా దర్శకుడు సుప్రీత్‌ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా ఇది.

ఇదొక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్ రాబోతుంది. అది చూసి అందరూ షాక్‌ అవుతారు. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. నిహాల్‌ కోదాటి మాట్లాడుతూ ''ఈ సినిమా చాలా అందంగా డిజైన్‌ చేశాం. ఫస్ట్‌ హాఫ్‌ ముగ్గురు యువకుల ఎంటర్‌టైన్‌ ఉంటే సెకండాఫ్‌లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఫాంటసీ, లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నాయి. మార్చి 21న అందరూ థియేటర్‌లో ఎంటర్‌టైన్‌ అవ్వొచ్చు. టైమ్‌కు, మనీకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది’’ అని అన్నారు.

Next Story