తారక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. కేవలం దాంతో సరిపెట్టనున్నారా?

by Pulgam srinivas |

తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన డ్రాగన్ చిత్రం నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తారక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. కేవలం దాంతో సరిపెట్టనున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు అధికారికంగా టైటిల్‌ను కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు ఒకటి, రెండు పోస్టర్లను మినహాయిస్తే ఎలాంటి ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయలేదు. ఇకపోతే మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి.

దాంతో తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడు మే 20వ తేదీ వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలా ఎదురుచూస్తున్న తారక్ అభిమానులకు డ్రాగన్ యూనిట్ పెద్ద షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ మూవీ బృందం తారక్ పుట్టిన రోజు సందర్భంగా ‘గ్లింప్స్’ వీడియో కాకుండా కేవలం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదే గాని జరిగితే చాలా కాలంగా ఈ సినిమా నుండి ‘గ్లింప్స్’ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పెద్ద షాక్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story