- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మం కోసం యుద్ధం.. విశ్వాసం కోసం పోరాటం..‘కేసరి వీర్’ అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి(Suniel Shetty), ప్రిన్స్ ధిమాన్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కేసరి వీర్’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ( Suniel Shetty), ప్రిన్స్ ధిమాన్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కేసరి వీర్’. సూపర్ పంచోలి, వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని చౌహాన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్స్’పై నిర్మిస్తున్నారు. అయితే 14వ శతాబ్దంలో అక్రమణదారులు నుంచి సోమ్‌నాథ్ ఆలయాన్ని రక్షించిన యోధుల ధైర్యసాహసాలను వెలుగులోకి తీసుకురానున్నట్లు సమాచారం. తుగ్లక్ సామాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య యోధుడు హమీర్జీ గోహిల్ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు టాక్.
షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మే 16న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘కేసరి వీర్’ ట్రైలర్ రాబోతున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ధర్మం కోసం యుద్ధం. విశ్వాసం కోసం పోరాటం. కేసరి వీర్‌తో సోమనాథ్ యోధుల అన్‌టోల్డ్ సాగాలో మునిగిపోండి: సోమనాథ్ లెజెండ్స్! రేపు ట్రైలర్ విడుదల కాబోతుంది. మే 16, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లలో అంచనాలు పెరిగిపోయాయి.






