60 శాతం పూర్తయిన ‘కల్కి 2’.. ప్రభాస్ నెక్స్ట్ ఫోకస్ దానిపైనే?

by Pulgam srinivas |   (  Updated:2026-05-09 10:01:23  IST  )

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రభాస్ తిరిగి వచ్చిన తర్వాత ‘స్పిరిట్’ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు, ఆ తర్వాత ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం.

60 శాతం పూర్తయిన ‘కల్కి 2’.. ప్రభాస్ నెక్స్ట్ ఫోకస్ దానిపైనే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో ‘కల్కి 2’ ఒకటి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఇందులో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ విదేశీ పర్యటనలో ఉన్నారు.

తిరిగి వచ్చిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తైన తర్వాత మళ్లీ ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా లేదా డిసెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుస సినిమాల షూటింగ్‌లతో ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.

సంపూర్ణేష్ బాబు బర్త్‌డేకు ‘ది ప్యారడైజ్’ టీమ్ సర్‌ప్రైజ్

Next Story