- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంపూర్ణేష్ బాబు బర్త్‌డేకు ‘ది ప్యారడైజ్’ టీమ్ సర్‌ప్రైజ్
సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ది ప్యారడైజ్’ మూవీ బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో మాత్రం తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన 'బిర్యాని' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. “హ్యాపీ బర్త్‌డే బిర్యాని” అంటూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాను 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజా పోస్టర్‌లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






