- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంచనాలు పెంచేసిన ‘45 ది మూవీ’
కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటి వరకు ‘

దిశ, సినిమా : కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటి వరకు ‘45 ది మూవీ’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిపారు. ఇక ‘45 ది మూవీ’ ట్రైలర్ చూస్తే మాత్రం కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. కొత్త రకమైన ఆయుధాలు, బాణాలతో దాడి, బుల్లెట్ల వర్షం, కొత్తగా క్రియేట్ చేసిన ద్విచక్ర వాహనం ఇలా అన్నీ డిఫరెంట్‌గానే కనిపిస్తున్నాయి. ఓ వైపు యుద్ద సన్నివేశాలు, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తూనే.. ప్రజెంట్ ట్రెండ్‌లోని సీన్లు కూడా చూపించారు. ఇక ఇందులో శివన్న లుక్స్, అప్పియరెన్స్ అదిరిపోయాయి. ఇక ఉపేంద్ర యాక్షన్, డైలాగ్ డెలివరీ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. రాజ్ బి శెట్టి, మొట్టా రాజేంద్రన్ కాంబో అదిరిపోయేలా ఉంది. ఈ సినిమాకు డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా వంటి వారు పోరాట సన్నివేశాల్ని కంపోజ్ చేశారు. అనిల్ కుమార్ మాటల్ని అందించగా.. ఈ మూవీకి సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేశారు.






