ఇద్దరు అగ్ర హీరోల సినిమా.. ట్రైలర్ విడుదల

by Gantepaka Srikanth |

ఇద్దరు అగ్ర హీరోల సినిమా.. ట్రైలర్ విడుదల

ఇద్దరు అగ్ర హీరోల సినిమా.. ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ సినీ అభిమానలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘45’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర కలిసి నటించిన ఈ మూవీ ట్రైలర్‌ అదిరిపోయింది. శివరాజ్ కుమార్ హీరోయిజం, ఉపేంద్ర టైమింగ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో రాజ్ బి.శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌లో విజువల్స్‌, BGM, VFX సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. విభిన్న కథాంశంతో వస్తున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఉపేంద్ర తనదైన శైలిలో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి, ఎం.రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా “45” సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు.

Next Story