35 Chinna Katha Kaadu: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరోసారి థియేటర్‌లోకి

by Chukka Sudharani |   (  Updated:2025-09-02 15:18:06  IST  )

నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో వచ్చిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘35 చిన్న కథ కాదు’.

35 Chinna Katha Kaadu: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరోసారి థియేటర్‌లోకి
X

దిశ, సినిమా: నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో వచ్చిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). రానా దగ్గబాటి (Rana Daggabati) సమర్పణలో సృజన్, సిద్ధార్థ్ నిర్మించిన ఈ చిత్రం గతేడాది వచ్చి సక్సెస్ అందుకుంది. లెక్కలు రానీ ఓ స్టూడెంట్, 35 మార్కులు సొంతం చేసుకుంటేనే స్కూల్‌లో ఉంటావు అనే టీచర్, మధ్యలో పేరెంట్స్ ఇలా మూడు క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఈ స్టోరీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ స్క్రీన్‌పైకీ రాబోతున్నది.

ఈ విషయాన్ని నటుడు రానా దగ్గుబాటి ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘ఉపాధ్యాయులు మన మొదటి కథకులు, జీవిత మార్గదర్శకులు.. అలాగే శాశ్వతంగా నిలిచి ఉండే విలువలను మనకు ఇచ్చేవారు. కాబట్టి.. ఈ ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా.. లెక్కలేనన్ని హృదయాలను తాకిన ఈ 35 చిన్న కథ కాదు చిత్రం ద్వారా ఉపాధ్యాయ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుందాం.. మనల్ని తీర్చిదిద్దిన ప్రతి ఉపాధ్యాయుడిని గౌరవించంతో పాటు.. మన ప్రియమైన బ్లాక్‌బస్టర్ యొక్క ఆనంద జ్ఞాపకాలను మరోసారి తిరిగి పొందడానికి థియేటర్లలో సెప్టెంబర్ 5న రాబోతున్నది.. మాతో చేరండి’ అని తెలిపారు. కాగా.. ఈ చితంలో నివేదా థామస్ (Nivetha Thomas), ప్రియదర్శి (Priyadarshi), విశ్వదేవ్ ఆర్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.

Next Story