- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూనిక్ లవ్ స్టోరీ ‘29’
విదు, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘29’. రియలిజం, ఫీల్ గుడ్, రా ఎమోషన్స్ కలిగిన యూనిక్ స్టోరీని రత్న కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘మెయ్యాద మాన్’, ‘ఆడై’, ‘గులు గులు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత గ్రిప్పింగ్ స్టోరీతో, హృదయాలను

దిశ, సినిమా : విదు, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘29’. రియలిజం, ఫీల్ గుడ్, రా ఎమోషన్స్ కలిగిన యూనిక్ స్టోరీని రత్న కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘మెయ్యాద మాన్’, ‘ఆడై’, ‘గులు గులు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత గ్రిప్పింగ్ స్టోరీతో, హృదయాలను హత్తుకునే ప్రేమ కథా చిత్రం ‘29’తో వస్తున్నాడు. కార్తికేయన్ ఎస్, లోకేష్ కనకరాజ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం0.. కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రోత్సహిస్తున్న స్టోన్ బెంచ్ స్టూడియో, జీ స్క్వాడ్ బ్యానర్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవనుంది. వైవిధ్యమైన సంగీతాన్ని అందించే సేన్ రోల్డన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటంతో మరోసారి డిఫరెంట్ మ్యూజిక్‌ను ఆస్వాదించబోతున్నారు ఆడియన్స్. లుక్, గ్లింప్స్ ద్వారా సినిమా వైబ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో మేకర్స్ సక్సెస్ కాగా పవర్‌ఫుల్ క్రియేటివ్ టీమ్, ఆసక్తికరమైన కథా నేపథ్యం కాంబోలో రూపొందుతోన్న ‘29’.. 2026లో తప్పక చూడాల్సిన అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.






