2026 సమ్మర్ టాలీవుడ్‌కు భారీ నిరాశ.. థియేటర్స్‌లో కనిపించని సందడి

by Pulgam srinivas |

స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో 2026 సమ్మర్ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా వెలవెలబోయింది.

2026 సమ్మర్ టాలీవుడ్‌కు భారీ నిరాశ.. థియేటర్స్‌లో కనిపించని సందడి
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీకి సమ్మర్ అనేది ఎంతో కీలకమైన సీజన్‌గా మేకర్స్ భావిస్తూ ఉంటారు. కానీ ఈసారి టాలీవుడ్‌లో సమ్మర్ సీజన్ వెలవెలబోయిందనే చెప్పాలి. సాధారణంగా మే నెలలో స్టార్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఒక్క స్టార్ హీరో సినిమా కూడా మే నెలలో విడుదల కాలేదు. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా మే నెలలో విడుదల అవుతుందని ఇండస్ట్రీ భారీ అంచనాలు పెట్టుకుంది.

కానీ ఆ సినిమా కూడా జూన్‌కు వాయిదా పడింది. దీంతో మే నెల మొత్తం బాక్సాఫీస్ బోసిపోయినట్టైంది. కేవలం మే నెల మాత్రమే కాకుండా ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా పెద్ద సినిమాలు లేకపోవడం గమనార్హం. కనీసం విడుదలైన చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. దీంతో చాలామంది సినీ విశ్లేషకులు ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమకు సమ్మర్ సీజన్ భారీ ఎదురుదెబ్బ కొట్టిందని అభిప్రాయపడుతున్నారు.

ప్రతి సంవత్సరం సమ్మర్‌లో విడుదలయ్యే పలు సినిమాలు భారీ కలెక్షన్లు సాధిస్తూ ఇండస్ట్రీకి ఊపిరి పోసేవి. కానీ ఈసారి మాత్రం టాలీవుడ్‌కు సమ్మర్ డిజాస్టర్‌గా మిగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. దీంతో ఈ మూవీపై ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story