సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |   (  Updated:2025-11-11 14:05:00  IST  )

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి.. సినీ లవర్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి.. సినీ లవర్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. దాదాపు 1:50 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ ప్రతీ షాట్ ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ట్రైలర్‌ను చాలా గ్రిప్పింగ్‌గా కట్ చేశారు మేకర్స్. రైల్వే కాలనీలో జరిగే ఓ రహస్యమైన కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ అల్లుకున్నట్లు అర్థమవుతోండగా.. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.

దీంతో ట్రైలర్ క్షణాల్లో వైరల్ కావడంతో.. ‘సూపర్ థ్రిల్లర్ ట్రైలర్.. బ్లాక్ బస్టర్ లోడింగ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కాగా.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ పోలిమేర, పోలిమేర 2 సినిమాలకు కథనందించిన రైటర్ అనీల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కూడా కథ ఇవ్వడంతో.. ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు నాని కాసరగడ్డ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.

Next Story