దీనస్థితిలో ప్రముఖ విలన్.. ఆర్థికసాయం చేయాలని అభ్యర్థన

by  |
Ponnambalam
X

దిశ, వెబ్‌డెస్క్ : విలక్షణమైన విలనిజంతో ఆకట్టుకున్న నటుడు పొన్నంబళం. తమిళచిత్ర పరిశ్రమకు చెందిన పొన్నంబళం.. బహుభాషా నటుడు. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారు. పొన్నంబళం సోదరి కుమారుడు కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినప్పట్టికీ ఆపరేషన్ ఖర్చులకు డబ్బులు లేక దాతల సాయం కోరుతున్నాడు.

ఒకప్పుడు తన విలనిజంతో చిత్రసీమను ఏలిన పొన్నంబళం నేడు ఆర్థికంగా చితికిపోయి దీనస్థితిలో ఉన్నారు. కనీసం ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేక తమిళ, తెలుగు చిత్రపరిశ్రమలను సాయం చేయాలని అర్థిస్తున్నారు. ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, శరత్ కుమార్, ధనుష్, కెఎస్. రవికుమార్, లారెన్స్, ఐసరి గణేష్ ఆర్థికసాయం చేశారని, ప్రస్తుతం కిడ్నీ మార్పిడికి చాలా ఖర్చు అవుతున్నందున దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్, దాతలు స్పందించి ఆర్థికసాయం చేయాలని ఆయన కోరారు. రోజురోజుకు తన ఆరోగ్యం క్షిణిస్తుందని, సాయం చేసి తన ప్రాణాలు కాపాడాలని పొన్నంబళం సినీ ప్రముఖులకు కోరారు.

Next Story

Most Viewed