- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ను కలవనున్న సినీ పెద్దలు.. ఎందుకంటే ?
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సినిమా థియేటర్లు, టికెట్ రేట్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కరోనా వల్ల థియేటర్ల యాజమాన్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం సినీపెద్దలు గతంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తాజాగా మరోసారి సీఎంతో భేటీ కావాలని నిర్ణయించారు. సినీ ప్రముఖులతో భేటీకి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. సినీరంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని మంత్రి పేర్ని నాని మెగాస్టార్ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సినిమా థియేటర్లు, టికెట్ రేట్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కరోనా వల్ల థియేటర్ల యాజమాన్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం సినీపెద్దలు గతంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తాజాగా మరోసారి సీఎంతో భేటీ కావాలని నిర్ణయించారు. సినీ ప్రముఖులతో భేటీకి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. సినీరంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని మంత్రి పేర్ని నాని మెగాస్టార్ చిరంజీవికి శనివారం తెలియజేశారు. థియేటర్లు, టికెట్లు, ఇతర అంశాలపై సీఎంతో మాట్లాడాల్సిందిగా సూచించారు. ఈ నెలాఖరులోగా ఈ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే.






