అలా చేసి ప్రాణాలు కోల్పోవద్దు : సుమన్

by  |

దిశ, కాజీపేట: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని సీనియర్ సినీ నటుడు సుమన్ కోరారు. నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు కాజీపేట సెంట్రల్ జోన్ పోలీసులు ఆదివారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుమన్ మాట్లాడుతూ.. మన జీవితం ఎంతో అమూల్యమైనది, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రోజుకి రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం వల్ల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజల సేవలో పోలీసులు ఎనలేని సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనా మహమ్మారి సమస్య పూర్తిగా సమసిపోలేదని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఏసీపీ శ్రీనివాస్, బాలస్వామి లతో పాటు సీఐ లు ఎస్ఐలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story