సెలెబ్రిటీస్.. క్రిస్మస్ విషెస్

by  |
సెలెబ్రిటీస్.. క్రిస్మస్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలు, ఇండ్లు, కూడళ్ల వద్ద క్రీస్తురాకకు ప్రతీకలుగా నక్షత్ర కాంతులీనుతున్నాయి. చర్చీలు విద్యుద్దీపాల వెలుగుల్లో విరాజిల్లుతున్నాయి. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుక జరుపుకునే ప్రజలకు, అభిమానులకు టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

క్రిస్మస్ జీవితంలో సంతోషాన్ని నింపాలి: మెగాస్టార్ చిరంజీవి

మీ జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని నింపాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. క్రిస్మస్ వేడుకలను ఆనందంగా ఈ రోజున సంతోషంగా ఫ్యామిలీతో కలిసి జరుపుకోండి. కొత్త సంవత్సరం మరింత కొత్తగా ఉండబోతుందని తెలిపారు.

https://twitter.com/KChiruTweets/status/1342311724913856512?s=20

క్రిస్మస్ శుభాకాంక్షలు: బిగ్ బీ అమితాబ్ బచ్చన్

తమ ఇంట్లో క్రిస్మస్ చెట్టును అందంగా అలరించుకుని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న అనంతరం బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్‌కు మెర్రీ క్రిస్మస్ విషెస్ చెప్పారు. బిగ్ బీ కుటుంబసభ్యులతో కలిసి క్యూట్ స్మైల్‌తో ఫొటోకి ఫోజులివ్వగా..ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు: సూపర్ స్టార్ మహేశ్‌బాబు

వేడుకలు జరుపుకుంటున్న అందరికీ మెస్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మీకు శాంతి, ఆనందం, ప్రేమను పరిపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సంతోషాన్ని, ప్రేమను ప్రతి ఒక్కరికీ పంచండి.

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా లండన్‌లో క్రిస్మస్ వేడుకలు జరపుకుంటోంది. భర్తతో కలిసి అంద‌రికీ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. క‌రీనా క‌పూర్ కూడా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జ‌రుపుకున్న క్రిస్మస్ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.

అందరికీ మెర్రీ క్రిస్మస్: అను ఇమ్మాన్యుయల్

టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ మెర్రీ క్రిస్మస్ విషెస్ చెప్పింది. ప్రతి ఒక్కరికీ ఈ క్రిస్మస్ శాంతి, ఆనందం, ప్రేమ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Next Story

Most Viewed