- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
49మందిలో ఏడుగురిపై కేసులు నమోదు !
<p>దిశ, ఏపీబ్యూరో: హైకోర్టు తీర్పులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని 49 మందికి నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. దరిశ కిశోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరంపై కోర్టు ధిక్కారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి పెట్టిన పోస్టులపై తమ ఎదుట హాజరుకావాలంటూ సీఆర్‌పీసీ […]</p>
దిశ, ఏపీబ్యూరో: హైకోర్టు తీర్పులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని 49 మందికి నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. దరిశ కిశోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరంపై కోర్టు ధిక్కారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి పెట్టిన పోస్టులపై తమ ఎదుట హాజరుకావాలంటూ సీఆర్‌పీసీ 41ఎ కింద నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యానించిన 49 మందిని గుర్తించి ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిలో ఈ ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మిగతా వారికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.






