వాహన తనిఖీల్లో CI కృష్ణకుమార్‌కు గాయాలు.. బైక్‌తో ఢీకొట్టి ఎస్కేప్

by Sridhar Babu |   (  Updated:2021-06-03 11:50:47  IST  )

<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ బైపాస్ రోడ్డులో గురువారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో రూరల్ సీఐ కృష్ణ కుమార్, సిబ్బంది వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ యువకుడు బైక్‌ను ఆపినట్లు ఆపి నిలపకుండా వెళుతూ జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్‌‌ను ఢీకొట్టాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సదరు వాహన చోదకుడు అదే [&hellip;]</p>

వాహన తనిఖీల్లో CI కృష్ణకుమార్‌కు గాయాలు.. బైక్‌తో ఢీకొట్టి ఎస్కేప్
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ బైపాస్ రోడ్డులో గురువారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో రూరల్ సీఐ కృష్ణ కుమార్, సిబ్బంది వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ యువకుడు బైక్‌ను ఆపినట్లు ఆపి నిలపకుండా వెళుతూ జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్‌‌ను ఢీకొట్టాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

అనంతరం సదరు వాహన చోదకుడు అదే వేగంతో పారిపోయాడు. గాయపడిన సీఐను డీఎస్పీ, పోలీస్ సిబ్బంది ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడినట్లు సమాచారం. అయితే, ఆ వాహన చోదకుని కోసం బైపాస్ రోడ్డులో గల అన్ని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Next Story