క్రిస్ గేల్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు

by  |
క్రిస్ గేల్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ క్రిస్ గేల్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. 41 ఏళ్ల గేల్ రెండేళ్ల క్రితమే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ, విదేశాల్లో జరిగే ప్రతీ లీగ్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడుతూ అందరి ఆదరణను చూరగొన్నాడు. ఐపీఎల్, పీఎస్ఎల్, అబుదాబి టీ10 వంటి లీగ్స్‌లో ఆడుతూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు క్రిస్ గేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నది. త్వరలో స్వదేశంలో శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌కు గేల్‌ను ఎంపిక చేశారు. గేల్‌తో పాటు కిరాన్ పొలార్డ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్‌ కూడా జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. ఎడ్వర్డ్స్ జాతీయ జట్టులోకి 9 ఏళ్ల తర్వాత రావడం గమనార్హం.

టీ20 జట్టు :

కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, జేసన్ హోల్డర్, అకీల్ హోసెన్, ఇవిన్ లూయీస్, అబెడ్ మెక్‌కాయ్, రోమవాన్ పావెల్, లెండిల్ సిమ్మన్స్, కెవిన్ సింక్లెయిర్

వన్డే జట్టు :

కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), షాయ్ హోప్, ఫాబియన్ అల్లెన్, డారెన్ బ్రావో, జాసన్ హోల్డర్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, ఇవిన్ లూయిస్, కైల్ మేయర్స్, జాసన్ మొహమ్మద్, నికోలస్ పూరన్, రొమారీ షెఫర్డ్, కెవిన్ సింక్లయిర్.



Next Story

Most Viewed