ఆ సీక్రెట్ రేపు రివీల్ చేస్తాను : చిరు

by  |
ఆ సీక్రెట్ రేపు రివీల్ చేస్తాను : చిరు
X

దిశ వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని భావాలను, తన అభిప్రాయాలను డైరెక్ట్ గా అభిమానులతో, ప్రజలతో పంచుకోవడానికి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. లాక్డౌన్ వేళ.. ఎప్పుడూ ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికరమైన విషయాలను ఫ్యాన్స్ కు తెలియజేస్తున్నారు. ఇటీవలే ‘బీ ద రియల్ మెన్’ చాలెంజ్ లోనూ పార్టిసిపేట్ చేసి, తెలంగాణ రాష్ర్ట మంత్రి కేటీఆర్ కు, తన స్నేహితుడు రజనీకాంత్ కు సవాల్ విసిరిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు కరోనా పై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు పై గీత రచయిత చంద్రబోస్ పాడిన పాటను షేర్ చేస్తూ.. పోలీసులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మనల్ని కాపాడుతున్నారని, వారికి సహాకరించాలని, మనమంతా వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా చిరు ఓ పాటను తరుచుగా వింటున్నానని.. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే..రేపు ఉదయం 9 వరకు వెయిట్ చేయాలని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

‘‘సాధారణంగా, మేము పాటలు షూట్ చేసినప్పుడు, నేను వాటిని పూర్తిగా వినేందుకు ఆనందిస్తాను. ఆ పాటలను మధ్యలో ఆపడం నాకెందుకో ఇష్టం ఉండదు. కానీ ఇటీవల నేను ఒక పాటను పాజ్ చేస్తూ.. మళ్లీ మళ్లీ మొదటి నుంచి పాటను వింటూ ఆనందిస్తున్నాను. అందుకు కార‌ణం ఏంట‌ంటే.. రేపు ఉదయం 9గం.ల‌కి చెబుతాను ’’అని త‌న ట్వీట్‌లో చిరు పేర్కొన్నారు. దీంతో మెగా అభిమానులు ఆ పాట గురించి ఏం చెబుతాడోనని ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

tags: chiru, megastar, twitter, new song, shooting news

Next Story

Most Viewed