జన్మనిచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: చిరు

by  |
జన్మనిచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: చిరు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి..తన తల్లి అంజనాదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా స్పెషల్ వీడియో షేర్ చేశారు. ‘డాడి’ సినిమాలోని గుమ్మాడి గుమ్మాడి సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుతూ డిజైన్ చేసిన వీడియో ఎమోషన్స్, మెమొరీస్‌తో ముడిపడి ఉండగా… వీడియోలో మెగా ఫ్యామిలీకి చెందిన మనవలు, మనవరాళ్లతో ఉన్న అనుంబంధాన్ని ఫొటోల ద్వారా చూపించారు. ముందుగా అమ్మానాన్న, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్, చెల్లెల్లతో కలిసిన ఫొటోను వీడియోలో అటాచ్ చేసిన చిరు.. ఆ తర్వాత వారి పిల్లల ఫొటోను షేర్ చేశాడు. సుస్మిత, శ్రీజను హగ్ చేసుకున్న అంజనాదేవి ఫొటోలతో పాటు శ్రీజ చిన్నకూతురిని ఎత్తుకున్న ఫొటో చాలా క్యూట్‌గా, లవెబుల్‌గా ఉంది. చివరగా చరణ్ నానమ్మను కేర్‌ఫుల్‌గా పట్టుకుని తీసుకెళ్తున్న ఫొటోతో వీడియో ఎండ్ అయింది.

నాగబాబు కూడా తల్లికి విష్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రయత్నం వెనకున్న బలం, చీకటి దారిలో వెలుగులు నింపిన ప్రకాశవంతమైన దీపంగా అమ్మను అభివర్ణించిన నాగబాబు.. తన దగ్గర ఉంటే అన్ని బాధలు మాయమైపోతాయని తెలిపాడు. తను స్ట్రాంగ్ మ్యాన్‌గా నిలిచానంటే కారణం స్ట్రాంగ్ మామ్ అన్న మెగా బ్రదర్.. ఈ జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపాడు.

Next Story

Most Viewed