అభిమానులందరికీ కృతజ్ఞతలు : చిరు

by Shyam |   (  Updated:2020-09-22 02:43:31  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మెగస్టార్ చిరంజీవి తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారంతో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్‌లో భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. ‘నా జీవితంలో ఆగస్టు 22కు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో&#8230; సెప్టెంబర్ 22కు కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఆగస్టు 22న నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే&#8230; సెప్టెంబర్ 22న నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు. ఈరోజు నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి, [&hellip;]</p>

అభిమానులందరికీ కృతజ్ఞతలు : చిరు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగస్టార్ చిరంజీవి తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారంతో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్‌లో భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. ‘నా జీవితంలో ఆగస్టు 22కు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో… సెప్టెంబర్ 22కు కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఆగస్టు 22న నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే… సెప్టెంబర్ 22న నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు. ఈరోజు నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి, ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులు అందరికీ, ముఖ్యంగా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’అని తెలిపారు.

Next Story