పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకు హెయిర్ స్టైలిస్ట్ ఎవరో తెలుసా?

by  |
పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకు హెయిర్ స్టైలిస్ట్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా ఫ్యామిలీ లో మెగాస్టార్ ఒక చెట్టు అయితే.. ఆ చెట్టును పట్టుకొని వచ్చిన కొమ్మలే మెగా హీరోలని చాలా వేదికలపైనా మెగా హీరోలు స్పష్టం చేసారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అన్న లేకుంటే నేను లేను.. అన్న చెప్పిన మాటల వలనే నేను హీరోను అయ్యాను అంటూ చాలా సందర్భాల్లో పవన్ తెలిపారు. అలాగే చిరు సైతం మెగా హీరోలందరూ అండగా నిలబడుతూ వారి ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటారు. ఇక ఆయనే దగ్గర ఉండి నటనలో ఓనమాలు నేర్పిన తమ్ముడి సినిమా మూడేళ్ళ తర్వాత విడుదలవుతున్న సందర్భంగా ఆయన ఒక త్రో బ్యాక్ పిక్ ని పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వెండితెరపై కనిపిస్తుండడంతో ఇటు అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా పండగ చేసుకుంటున్నారు. సినిమా హిట్ అవ్వాలని కోరుతు ట్విట్టర్ వేదికగా వకీల్ సాబ్ చిత్రానికి విషెస్ తెలుపుతున్నారు. తాజాగా చిరు సైతం తమ్ముడిని వెండి తెరకు పరిచయం చేసిన తొలినాళ్ల చిత్రాన్ని షేర్ చేసి విషెస్ చెప్పారు. “చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో ‘వకీల్ సాబ్’ చూస్తున్నాను. ఈ సినిమాపై నా స్పందన తెలియజేయడానికి ఎదురు చూడలేక పోతున్నా” అంటూ పోస్ట్ చేశారు.

ఇక ఫొటోలో పవన్ కళ్యాణ్ కి హెయిర్ సరి చేస్తూ, తమ్ముడి ఫేస్ ని ఇంకా అందంగా రెడీ చేస్తున్నారు చిరు. బ్లాక్ లెదర్ జాకెట్స్ లో అన్నదమ్ములు ఇద్దరు అదిరిపోయారు. ఇకపోతే ఈ ఫోటో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్ర మేకింగ్ లో తీసిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో ను మెగా అభిమానులు వైరల్ గా మార్చేశారు.



Next Story

Most Viewed