చిరు స్టన్నింగ్ లుక్..

by  |
చిరు స్టన్నింగ్ లుక్..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారి కోడలు సమంత మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. కానీ అది బిగ్ స్క్రీన్ మీద కాదు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద. ఆహాలో సామ్ జామ్ అంటూ బిగ్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న సామ్.. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి నుంచి ప్రజలకు విలువైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సెలబ్రిటీస్‌తో అల్లరి కూడా చేయించి ఆడియన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్‌గా వచ్చి ఆకట్టుకోగా.. ఇప్పటికే 12 మంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి అని సమాచారం.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సామ్ జామ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఏజ్ కేవలం నంబర్ మాత్రమే అన్నట్లు కనిపిస్తున్న చిరు గ్రే కలర్ బ్లేజర్‌లో అదిరిపోయారు. ఫార్మల్ సూట్‌, చరిష్మాటిక్ వాక్, హార్ట్ వార్మింగ్ స్మైల్‌తో మోస్ట్ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న చిరు లుక్‌కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ మెగాస్టార్ ఫర్ ఎవర్ అంటున్నారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Next Story

Most Viewed