రెచ్చిపోయిన రియల్టర్లు.. కల్వర్టు కూల్చివేత

by  |
Complaint Letter
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో రియల్టర్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రియల్టర్ల దందాకు అడ్డుగా ఉన్న దేనినీ వదలడం లేదు. ప్రభుత్వ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేయడం గమనార్హంగా మారింది. తాజాగా.. రియర్టర్లు మరోసారి రెచ్చిపోయారు. చిన్నకందుకూరు నుంచి బాపన్నగూడెం, చోల్లేరుకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్ట్‌ను పక్కనే ఉన్న వెంచర్ ఓనర్లు తొలగించారు. దీంతో ఆ మార్గం నుండి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడంతో వాహనదారులు గాయాలపాలవుతున్నారు. దీనిపై యాదగిరిగుట్ట ఎంపీడీఓ ఆఫీసులో చిన్నకందుకూరు గ్రామ యువకులు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులెవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని వారి ఆగడాలను అడ్డుకోవాలని కోరారు.

Next Story

Most Viewed