ప్రపంచంలోనే తొలి కాంతిపుంజ కంప్యూటర్

by  |
ప్రపంచంలోనే తొలి కాంతిపుంజ కంప్యూటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌కు మూలం అని భావిస్తున్న ‘చైనా’ పేరు చెబితే చాలు.. ప్రపంచవ్యాప్తంగా అందరూ భయపడుతున్నారు. కొవిడ్ మహమ్మారి చేసిన కల్లోలం అలాంటిది మరి. ఏడాది కాలంగా కరోనాతో వార్తల్లో నిలిచిన చైనా.. ఇప్పుడు ఓ కొత్త ఆవిష్కరణతో వార్తల్లో నిలిచింది. అయితే ఇదేదో కొవిడ్ విషయంలో మాత్రం కాదు.. టెక్నాలజీ రంగంలో. చైనా శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్ కంటే ట్రిలియన్ టైమ్స్ వేగంగా పని చేసే క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారుచేశారు.

శక్తిమంతమైన మెషిన్ల తయారీలో కొత్త పోకడలకు ఈ క్వాంటమ్ కంప్యూటర్ నాంది పలుకుతుందని, ఇది గొప్ప విజయమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కాంతి పుంజ క్వాంటమ్ కంప్యూటర్‌కు పురాతన గణనా కోశం వెతికి జియుఘంగ్ (Jiuzhang) అని పేరు పెట్టారు. ఇది నిగూఢ లెక్కలను గాసియన్ బోసన్ శాంప్లింగ్ పద్ధతితో 200 సెకండ్లలో పూర్తి చేస్తుందని, ఇవే లెక్కలను క్లాసికల్ సూపర్ కంప్యూటర్ చేస్తే 600 మిలియన్ల ఏళ్లు పడుతుందని వారు పేర్కొన్నారు.


Next Story

Most Viewed