ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ -చిన్న రాజప్ప 

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయవర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఈ అంశంపై ఇటు టీడీపీ శ్రేణులు, వైసీపీ రెబెల్ నేత ఎంపీ రఘురామకృష్ణ రాజు అధికార పార్టీపై పలుఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చిన్న రాజప్ప పాలకపక్షంపై పలు ప్రశ్నలు సంధించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ&#8230; ఫోన్ ట్యాపింగ్ బయటపడే సరికి అధికారపక్షంలో అలజడి మొదలైందన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో విచారణకు సిద్ధమని [&hellip;]</p>

ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ -చిన్న రాజప్ప 
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయవర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఈ అంశంపై ఇటు టీడీపీ శ్రేణులు, వైసీపీ రెబెల్ నేత ఎంపీ రఘురామకృష్ణ రాజు అధికార పార్టీపై పలుఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చిన్న రాజప్ప పాలకపక్షంపై పలు ప్రశ్నలు సంధించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ బయటపడే సరికి అధికారపక్షంలో అలజడి మొదలైందన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో విచారణకు సిద్ధమని ఎందుకు చెప్పడం లేదు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్‌కు ప్రయత్నిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

Next Story