ఇండియాలో నిర్బంధం.. చైనాలో ఎత్తివేత

by  |
ఇండియాలో నిర్బంధం.. చైనాలో ఎత్తివేత
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి పురుడుపోసుకున్న చైనా ఇప్పుడిప్పుడే దాని నుంచి విముక్తి పొందుతున్నది. హుబెయి ప్రావిన్స్ వుహాన్ నగరంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తున్నది. రెండు నెలలుగా దిగ్బంధంలో ఉన్న ఈ ప్రావిన్స్ లో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రకటించింది. దీంతో రెండు నెలలుగా మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్న చైనా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

కరోనా నిర్బంధం నుంచి చైనా స్వేచ్ఛా వాయువులు పీలుస్తుండగా ఆ దేశం నుంచి వైరస్ దిగుమతి చేసుకున్న యూరప్ దేశాలు సహా భారత్ నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. ఇటలీ, స్పెయిన్, జర్మనీ ఈ మహమ్మారి దాటికి విలవిల్లాడుతున్నాయి.

మన దేశంలో ఇప్పటికే 32 రాష్ట్రాలు(యూటీ సహా) లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల సరిహద్దులు బంద్ చేసుకున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్తంభించింది. ట్రైన్స్ సేవలు నిలిచిపోయాయి. ఈ నెల 22 నుంచి 31 వరకు అంతర్జాతీయ విమానాలను కేంద్రం నిషేధించింది. అలాగే దేశీయంగా నడిచే సుమారు 650 విమానాలను నిలిపేసింది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కంటే ఒక అడుగు ముందుకేసి కర్ఫ్యూ విధించారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక భూభాగం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఇప్పుడు హుబెయి ప్రావిన్స్ ను భారత్ తలపిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి.

Tgas: Coronavirus, hubei, wuhan, india, lockdown, restrictions


Next Story