- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాల్వన్ ఘటన.. చైనా ప్రణాళికనే: అమెరికా
<p>న్యూఢిల్లీ: గాల్వన్ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పొరుగుదేశాలతో దుడుకు వైఖరి అవలంభించాలనే చైనా వ్యూహంలో భాగంగానే చోటుచేసుకుందని అమెరికా పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో లడాఖ్ సమీపంలోని చైనా సరిహద్దులో ఉభయ దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన చైనా ప్లాన్ ప్రకారమే జరిగిందని, కొన్ని మరణాలూ చోటుచేసుకునేలా చైనా అనుసరించిన వ్యూహమే కారణమని ఆధారాలు రుజువుచేస్తున్నాయని యూఎస్-చైనా ఎకనామిక్స్ అండ్ సెక్యూరిటీ […]</p>

న్యూఢిల్లీ: గాల్వన్ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పొరుగుదేశాలతో దుడుకు వైఖరి అవలంభించాలనే చైనా వ్యూహంలో భాగంగానే చోటుచేసుకుందని అమెరికా పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో లడాఖ్ సమీపంలోని చైనా సరిహద్దులో ఉభయ దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన చైనా ప్లాన్ ప్రకారమే జరిగిందని, కొన్ని మరణాలూ చోటుచేసుకునేలా చైనా అనుసరించిన వ్యూహమే కారణమని ఆధారాలు రుజువుచేస్తున్నాయని యూఎస్-చైనా ఎకనామిక్స్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన రిపోర్టులో వెల్లడించింది. మేనెలలో పలు ఘర్షణలు జరగడం మొదలై జూన్‌లో ఈ ఘటన సంభవించిందని పేర్కొంది. జపాన్ నుంచి ఇండియా వరకు మిలిటరీ, పారామిలిటరీ బలగాలతో అణచివేత ధోరణిని చైనా ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తున్నదని వివరించింది. ఇండియా-చైనా సరిహద్దులో సుస్థిరత్వానికి బలగాలు ఉపయోగించాలని చైనా రక్షణ మంత్రి సూచించిన తర్వాత గాల్వన్ ఘటన జరగడం గమనార్హం.






