- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాలో వ్యాక్సిన్ ప్రదర్శన
<p>దిశ, వెబ్‌డెస్క్: చైనా మొదటిసారిగా తన స్వదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రదర్శనకు ఉంచింది. చైనాకు చెందిన సినొవిక్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను బీజింగ్‌లో జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో బహిరంగపరిచింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను నిర్వహిస్తోంది. అనంతరం ఈ వ్యాక్సిన్‌కు మార్కెట్ లభించే అవకాశాలున్నాయని వ్యాక్సిన్ తయారీదారులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మూడో దశ ప్రయోగాలు పూర్తవుతాయని, ఏడాదికి 30 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని, దీనికోసం ఇప్పటికే ప్రత్యేక […]</p>

దిశ, వెబ్‌డెస్క్: చైనా మొదటిసారిగా తన స్వదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రదర్శనకు ఉంచింది. చైనాకు చెందిన సినొవిక్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను బీజింగ్‌లో జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో బహిరంగపరిచింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను నిర్వహిస్తోంది. అనంతరం ఈ వ్యాక్సిన్‌కు మార్కెట్ లభించే అవకాశాలున్నాయని వ్యాక్సిన్ తయారీదారులు భావిస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి మూడో దశ ప్రయోగాలు పూర్తవుతాయని, ఏడాదికి 30 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని, దీనికోసం ఇప్పటికే ప్రత్యేక కర్మాగారాన్ని నిర్మించినట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ వర్గాలు తెలిపాయి. మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇక, చివరి దశ ప్రయోగాలు పూర్తయిన తర్వాతే ఫలితాలను తెలియజేయనున్నట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ వెల్లడించింది.






