- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేషుడి నిమజ్జన శోభాయాత్రలో పిల్లల క్రియేటివిటీ సూపర్.. వీడియో
<p>దిశ, ముధోల్ : కొవిడ్ కారణంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి డీజేలకు అనుమతి లేదు. దీంతో భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్క యూత్ సభ్యులు శోభాయాత్రకి తెలంగాణ, పక్క రాష్ట్రం మహారాష్ట్ర ప్రాంతాల నుండి బ్యాండ్, సన్నాయి మేళాలు తీసుకువస్తున్నారు. ఈ సారి బ్యాండ్ బజాయించే వారికి డిమాండ్ పెరిగింది. అయితే శోభాయాత్రకు బ్యాండ్ దొరకకపోవడంతో పట్టణంలోని కుంట గల్లీకి చెందిన ఓ మండప నిర్వాహకులు వారి ఇంటి వద్ద ఉన్న […]</p>

X
దిశ, ముధోల్ : కొవిడ్ కారణంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి డీజేలకు అనుమతి లేదు. దీంతో భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్క యూత్ సభ్యులు శోభాయాత్రకి తెలంగాణ, పక్క రాష్ట్రం మహారాష్ట్ర ప్రాంతాల నుండి బ్యాండ్, సన్నాయి మేళాలు తీసుకువస్తున్నారు. ఈ సారి బ్యాండ్ బజాయించే వారికి డిమాండ్ పెరిగింది.
అయితే శోభాయాత్రకు బ్యాండ్ దొరకకపోవడంతో పట్టణంలోని కుంట గల్లీకి చెందిన ఓ మండప నిర్వాహకులు వారి ఇంటి వద్ద ఉన్న ఖాళీ నూనె డబ్బాలను తీసుకొచ్చి, గణేశుని ముందు వాయిస్తూ ఊరేగింపుగా నిమజ్జన వేడుకలు నిర్వహించారు. ఇది చూసిన ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ రేకు డబ్బా బ్యాండ్ ను చూడడానికి ప్రజలు గుమ్మిగూడారు. ఏదేమైనా ఆ పిల్లల రేకు డబ్బా ఆలోచనకి సలాం అంటూ స్థానికులు మెచ్చుకున్నారు.
Next Story






