పరిగిలో ఇంటిపై నుంచి పడి చిన్నారి మృతి

80
18-baby

దిశ, పరిగి: ఆడుకుంటున్న చిన్నారి ఇంటిపై నుంచి పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద సంఘటన పరిగి మున్సిపల్​పరిధిలోని అయ్యప్ప కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాపోల్ గ్రామానికి చెందిన సందీప్–ప్రశాంతి దంపతలు పరిగిలోని అయ్యప్ప కాలనీలో అద్దెకు ఉంటున్నారు. కాగా శుక్రవారం వారి కూతురు వర్నిక(18 నెలలు) ఇంట్లోని రెండో అంతస్తులో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు కిందపడింది. దీంతో ఆ చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషయమంగా ఉందని తెలిపారు. వెంటనే నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందింది.