చేపల చెరువులో చికెన్ వ్యర్థాలు

by  |
చేపల చెరువులో చికెన్ వ్యర్థాలు
X

దిశ, కోదాడ: చెరువులో చికెన్ వేసి పదార్థాలు వేసి చేపలు పెంచుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. చికెన్ మటన్‌తో పోల్చుకుంటే చేపలో కొవ్వు తక్కువగా ఉంటుందని నాన్‌వెజ్ ప్రియులు కొంటుంటారు. కానీ వాటికి ఏం మేత వేసి పెంచుతారో తెలిస్తే ఇక అంతే.. మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో మాతంగి చెరువు సమీపంలో పొలాన్ని చెరువు కుంటగా ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా చికెన్ వేస్ట్‌తో చేపల సాగు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రకు చెందిన కొంతమంది ఫిష్ మాఫియా వాళ్లు ఈ దందా నిర్వహిస్తున్నారు. చెరువుల్లో నదుల్లో చేపలైతే వాడికి నచ్చినా రక రకాల సహజమైన ఆహారాన్ని తింటాయి. సహజ సిద్ధంగా పెరుగుతాయి కానీ కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువు కుంటలలో చేపలు ఎలాంటి ఆహారం దొరకదు కాబట్టి నిర్వాహకులు దాణ వేస్తారు. అచ్చంగా దాణా వేసినట్లయితే లాభాలు తక్కువగా వస్తాయి. అందుకే జీవ వ్యర్థాలను ఫిష్ మాఫియా వాటికి వేస్తారు.

పట్టణంలోని, చుట్టుపక్కల గ్రామాలలో తీసుకువచ్చిన చికెన్ వేస్ట్‌ను చేపలకు వేస్తున్నారు. కోళ్ల పేగులు తలకాయ లు కాళ్లు చేపలు తినేస్తున్నాయి. దీంతో దాణా ఖర్చు తగ్గుతుంది చేపలు త్వరగా పెరుగుతాయి. అందుకే మాఫియా చికెన్ వృర్థాలతో చేపల పెంపకం నిర్వహిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు ధనార్జనే ధ్యేయంగా చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

దీనిపై నిర్వాహకులు క్యాట్ ఫిష్ కాదు ఫంగస్ జెల్లా అని తెలుపుతున్నారు. కానీ చాపల కుంటపై చికెన్ వేస్ట్ పేగులు తలకాయలు కాళ్లు తేలియాడుతూ ఉన్నాయి. వీటిని చెన్నైకి తరలిస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని పెద్ద చెరువు చు ట్టుపక్కల కూడా ఇలా చేపల కుంటలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ చేపల కుంట దుర్వాసన వెదజల్లుతోంది, ఈ విధంగా పెంచిన చేపలను తింటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి ప్రజా ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

చర్యలు తప్పవు: సౌజన్య, జిల్లా ఫిషర్ అధికారి

జీవ వ్యర్థాలతో చేపల పెంపకం చేపడితే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రజల ప్రాణాలతో చెలగా టం అడితే ఉపేక్షించేదిలేదు. ఇలా చేపల పెంపకం చేస్తున్న తెలిస్తే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.


Next Story